జెరుసలెంపై ఇండియా మాట ఇదీ!

జెరుసలెంపై ఇండియా మాట ఇదీ!

07-12-2017

జెరుసలెంపై ఇండియా మాట ఇదీ!

ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మధ్య ప్రాచ్య దేశాల్లో ఈ నిర్ణయం వల్ల మరోసారి అశాంతి నెలకొంటుందని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఈ కీలక అంశంపై ఇండియా కూడా తన వైఖరిని వెల్లడించింది. పాలస్తీనాపై తమ వైఖరి స్వతంత్రంగానే ఉంటుంది తప్ప, మరో దేశం దీనిని నిర్ణయించలేదని సృష్టం చేసింది. పాలస్తీనా విషయంలో మా వైఖరి నిలకడగా ఉంటుంది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే నిర్ణయం తీసుకుంటాం తప్ప దీనిపై మరో దేశ ప్రభావం ఉండదు అని విదేశంగా శాఖ అధికార ప్రతినిధి రవీష్‌ కుమార్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌ రాజధానిగా వివాదాస్పద జెరుసలెంను గుర్తిస్తున్నామని, అమెరికా ఎంబసీని కూడా టెల్‌ అవిన్‌ నుంచి జెరుసలెంకు మారుస్తామని ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలసిందే. అయితే మిడిల్‌ ఈస్ట్‌లోని అరబ్బుల, ముస్లింలు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.