కాలుష్యంలో నడక... నిష్ప్రయోజనం

కాలుష్యంలో నడక... నిష్ప్రయోజనం

07-12-2017

కాలుష్యంలో నడక... నిష్ప్రయోజనం

ఆరోగ్యంపై శ్రద్ధతో చాలా మంది వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి వాతావరణంలో చేస్తున్నామనేది పట్టించుకోరు. అయితే కాలుష్య వాతావరణంలో వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనమూ ఉండదని అంటున్నారు పరిశోధకులు. యూకేకు చెందని ఇంపీరియల్‌ కాలేజీ, నార్త్‌ కరోలినాకు చెందిన డ్యూక్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. కాలుష్య, ప్రశాంత వాతావరణంలో రెండు గంటల పాటు వాకింగ్‌ చేసిన పలువురిని పరిశీలించగా, కాలుష్య వాతావరణంలో వాకింగ్‌ చేసిన వారిలో ఆరోగ్య పరంగా ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదని చెప్పారు. పైగా పెద్దవారిలో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.