ఆ జాబితాలో ఒబామా పాపులర్‌

ఆ జాబితాలో ఒబామా పాపులర్‌

07-12-2017

ఆ జాబితాలో ఒబామా పాపులర్‌

అత్యంత ప్రజాదరణ పొందిన ట్వీట్ల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా ముందంజలో ఉన్నారు. ఎక్కువ మంది ఇష్టపడ్డ ట్వీట్ల జాబితాలో ఒబామా మొదటి స్థానంలో ఉండగా, రీ ట్వీట్‌ చేసిన ట్వీట్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఓ ఇంటి కిటికిలో నుంచి తొంగి చూస్తున్న పిల్లల్ని అప్యాయంగా పలకరిస్తున్న పోటోతో పాటు, నెల్సన్‌ మండేలా సూక్తుల్లో ఒకటైన మతం, శరీర ఛాయ, నేపథ్యం ఆధారంగా ఎవరూ ఇంకొకరిని ద్వేషించరు అంటూ ఆయన చేసిన ట్వీట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సంవత్సరం ఆగస్టులో వర్జీనియాలోని చార్లెట్స్‌ విల్లేలో పెద్ద ఎత్తున జాతి విద్వేషాలు చెలరేగాయి. ఇది జరిగిన మరుసటి రోజు ఒబామా ఆ ట్వీట్‌ చేశారు. ఒబామా ట్వీట్‌ను 4.6 మిలియన్ల మంది ఇష్టపడ్డారు.