ఆస్ట్రేలియాలో పండుగలా శతాబ్దం గుర్తుండేలా జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు …!!

ఆస్ట్రేలియాలో పండుగలా శతాబ్దం గుర్తుండేలా జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు …!!

03-12-2017

ఆస్ట్రేలియాలో పండుగలా శతాబ్దం గుర్తుండేలా జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు …!!

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో దుర్గా ఆలయం ఆడిటోరియం సిడ్నీలో జరిగిన ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు ముఖ్య అతిధిగా పాల్గొన్న శాఖా మాత్యులు శ్రీ నాయని నరసింహ రెడ్డి గారు తో పటు MP Jodi Mckay (Member of the Legislative Assembly Shadow Minister for Transport, Shadow Minister for Roads, Maritime and Freight), MP జియోఫ్రేలీ (Member of the Legislative Assembly, Parliamentary Secretary to the Premier, Western Sydney and Multiculturalism)

వివిధ ఆస్ట్రేలియ సంస్థల ప్రతినిధులు, తెలంగాణ ఎన్నారైలు పేద సంఖ్యలో పాల్గొన్నారు. నాయనినరసింహ రెడ్డి గారు సభను ఉదేశించి మాట్లాడుతు ఉస్మానియా యూనివర్సిటీ దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్శిటీ మన ఉస్మానియా యూనివర్శిటీని ఎంతో మంది విద్యార్థులను మేధావులు, మహానేతలుగా తీర్చిదిద్దిన ఘనచరిత్ర కలదని, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమాలకు పురిటిగడ్డ మన ఉస్మానియా యూనివర్శిటీని చరిత్రలో నిలిచిన ఒక విద్యా సంస్థకు.. వందేండ్లు రావడం.. శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. జరిగిన.. జరుగుతున్న.. జరగబోయే విశేషాలెన్నింటినో మరోసారి ఇలా గొప్ప వేదిక మీద సమీక్షించుకోవడం.. స్మరించుకోవడం చాల సంతోషంగా ఉందని దాని లో నేను భాగం కావడం చాల గర్వాంగా ఉందని చెప్పారు.

తెరాస పార్టీ తెలంగాణ పోరు బాటలో ఎంతగా నిక్కచ్చిగా నిల్చిందో,  ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో పాలనలోనూ  కూడా అంతే నిస్వార్ధంగా ముందుకు సాగుతున్నామని. కేసీఆర్‌  పేరే ఒక సంచలనం. తెలంగాణ సమాజాన్ని ఏకోన్ముఖంగా ముందుకు నడిపిన మంత్రం. అసాధ్యాలను సుసాధ్యం చేసిన అద్భుతం. తెలంగాణను బంగారు తెలంగాణగా చేసే దిశగా, హైదరాబాద్‌ను విశ్వనగరం చేసే దిశగా టీఆర్ఎస్ పార్టీ  అహర్నిశలు శ్రమినిస్తున్నామనితెలంగాణ లో విద్యుత్‌ చీకట్లు శాశ్వతంగాతరిమికొట్టిన పార్టీ టీ ఆర్ఎస్ పార్టీ అని, రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అభివృద్ధే తమ నినాదమని ఉద్ఘాటించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే తమ ధ్యేయమని ప్రకటించారు.

తెలంగాణ పోలీస్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నేడు 90 శాతం గ్రాడ్యూయేట్స్ కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై వరకు దరఖాస్తు చేసుకుంటున్నారని, సివిల్,ఆర్ముడ్ రిజర్వుడ్ తదితర పోలీసులందరికీ ఐపీఎస్‌లతో సమానంగానే శిక్షణ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులు నేర పరిశోధన, నేరాల అదుపునకు నిర్థిష్టమైన ప్రణాళికతోముం దుకు సాగుతున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక మాట పదేపదే చెప్పే వారు, తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో తెచ్చుకున్న తెలంగాణను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం అని, దాని కొరకై ప్రతిఒక్కరు తమ వంతు కృషి చేయాలనీ ఎన్నారైలు కూడా బంగారు తెలంగాణగా చేసే దిశగా తమవంతుగ థన్,మన్, ధన్ వ్యాచించాలని కోరారు.

ఈ కారిక్రమంలో టీఆర్ఎస్ ప్రతినిధుల జీహెచ్ఎంసీ  స్టాండింగ్ కమిటీ సభ్యుడు - v శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతు తాను కూడా ఉస్మానియా యూనివర్సిటీ లో గ్రాడ్యుయేట్ చేసి తెలంగాణ ఉద్యమంలో లో చురుకగా పాల్గొనని సభ కు తెలియ చేసారు తాను ఈరోజు ఈలా ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు పాలుపంచుకోవడం గర్వాంగా ఉందని ఆస్ట్రేలియా లో వున్నా తెలుగు ఆడపడుచులు అందరు మన తెలంగాణలో తయారు చేసిన  పోచంపల్లి చీరలు ధరిస్తే తెలంగాణ లో వున్న పోచంపల్లి కార్మికులకు ఎంతో ఉపోయోగపడ్తురని గుర్తుచేశారు అందుకే తాను ఆస్ట్రేలియన్ MP జోడీ మాకేయ్ కు తెలంగాణ గుర్తుగ ప్రత్యేక పోచంపల్లి చీరను బహుకరించారు.

టీఆర్ఎస్ నగరప్రధాన కార్యదర్శి - శ్రీ. మహమ్మద్. అజమ్ అలీ గారు తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకొంటున్నారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని పేర్కొన్నారు.

ఈ కారిక్రమంలో  టీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు - శ్రీ.  సంతోష్ గుప్తా, ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు కామిటే చైర్మన్ వినోద్ ఎలెట, మహేష్ ఘంటాసాల భారతీ రెడ్డి, ఇంద్రసేన్, పాపి రెడ్డి నరసింహ రెడ్డి పాల్గొన్నారు.ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు అశోక్ మాలిష్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సేరి, ప్రదీప్ తెడ్ల ,రామ్ గుమ్మడివాలి, గోవెర్దన్  సుమేషు రెడ్డి, వాసు తాట్కూర్, ప్రమోద్ ఎలెటే, ప్రశాంత్ కడప్రూర్తి, డేవిడ్ రాజు, మిథున్ తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery