డెట్రాయిట్‌లో మహీంద్రా ప్లాంట్‌

డెట్రాయిట్‌లో మహీంద్రా ప్లాంట్‌

22-11-2017

డెట్రాయిట్‌లో మహీంద్రా ప్లాంట్‌

వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా విదేశాల్లో మార్కెట్‌ను పెంచుకుంటోంది. దీనిలో భాగంగా డెట్రాయిట్‌లో మెక్కా ఆటోమొబైల్స్‌ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. 25 సంవత్సరాల్లో తొలి ఆటోమోటివ్‌ ప్రొడక్షన్‌ సౌకర్యాన్ని నెలకొల్పింది. అంతేకాదు ఈ ప్లాంట్‌ద్వారా అక్కడ 250 ఉద్యోగాలను కూడా సంస్థ కల్పించనుంది. మెక్కా ఆటోమోటివ్‌ నార్త్‌ అమెరికాలో రిబ్బన్‌ కట్‌ చేసి ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, మిచిగాన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బ్రియాన్‌ కాలీ హాజరై ఈ ప్లాంట్‌ను ప్రారంభోత్సవం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు, మిచిగాన్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌, స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి వచ్చారు. ఈ ప్లాంట్‌ కోసం మహీంద్రా కంపెనీ 230 బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. దీంతో 250 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నారు. దీని ద్వారా ఆఫ్‌ హైవే వాహనం రోక్సర్‌ 10 వేల యూనిట్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది. 2020 సంవత్సరానికి అదనంగా 600 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా 400 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.