తెలంగాణా లో పెట్టుబడులు పెట్టాలి - ప్రపంచ వాణిజ్య సదస్సులో మహేష్ బిగాల
MarinaSkies
Kizen

తెలంగాణా లో పెట్టుబడులు పెట్టాలి - ప్రపంచ వాణిజ్య సదస్సులో మహేష్ బిగాల

18-11-2017

తెలంగాణా లో పెట్టుబడులు పెట్టాలి - ప్రపంచ వాణిజ్య సదస్సులో మహేష్ బిగాల

యూకే పార్లమెంట్ లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఎన్నారై తెరాస కోఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్ చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమలన్న గారు పాల్గొన్నారు. శ్రీ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ టీహబ్ టాస్క్ మొదలగువంటి ప్రభుత్వ సంస్దలు క్వాలిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం లో ఎంతో తోడ్పడుతున్నాయి అని ఇన్వెస్టర్స్ కి వివరించారు. తెలంగాణ లో ఉన్న ట్యాలెంట్ నేడు ప్రపంచానికి అవసరం అని అందుచేతనే  గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్ వంటి బహుళ జాతి సంస్దలు తెలంగాణ లో వాటి సంస్దలను స్థాపించారు అని చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ కేటీర్ గారి  అకుంఠిత దీక్ష పట్టుదల వాళ్ళ నేడు తెలంగాణ భారత దేశం లోనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో అలాగే  అభివృద్ధి లోకూడా 1 వ స్థానం లో ఉన్నదని వివరించారు. ప్రపంచం లోనే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఐతే తెలంగాణా భారత్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని గుర్తుచేశారు. ఇంతటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం లో ఇన్వెస్టర్స్ వారి కంపెనీలను స్థాపిస్తే వారు కూడా కూడా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వివరించారు. ఐతే ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా 2nd టియర్ సిటీ పాలసీ / రురల్ పాలసీ కింద నిజామాబాద్ లాంటి పట్టణాలల్లో పెట్టుబడులు పెడితే ప్రభుత్వం తరపున అనేక అదననపు పారితోషికాలు లభిస్తాయని వాణిజ్య వేత్తలకు వివరించారు. నిజామాబాదు లో పెట్టుబడులు పెట్టాలి అని ఆసక్తి చూపిన సంస్దలకు ఇక్కడి భౌగోళిక స్థితిగతులను, ఎలాంటి కంపెనీలను పెడితే లాభాలు ఆర్జించొ వివరించారు.

నిజామాబాద్ లాంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాలలో 2nd టియర్ సిటీ పాలసీ / రురల్ పాలసీ కింద పెట్టుబడులు పెడితే (ROI) అనగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ త్వరగా సాధించవచ్చు అని చెప్పారు. ఆ తరువాత జరిగిన ప్రశ్నోత్తరాల సమయం లో చాలా మంది పెట్టుబడిదారులు నిజామాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. కొల్హాపూర్ లోని మనోరమ ఇన్ఫో సోలుషన్స్ అనే సంస్ధ నిజామాబాదు వచ్చి వారి సంస్దను పెట్టే అవకాశాలును పరిశీలిస్తామని మహేష్ బిగల గారికి చెప్పారు. భారతీయ సంతతికి చెందిన ఈలింగ్ సౌథాల్ ఎంపీ శ్రీ వీరేంద్ర శర్మ గారి చేతులమీదుగా లండన్ లో స్థిరపడ్డ గోలి తిరుపతి గారు లెటర్ అఫ్ ఇంటెంట్ ని మహేష్ బిగాలగారికి అందించారు.

తెలంగాణ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్స్ ఇంఫ్రాస్ట్రుక్చర్స్ చైర్మన్ శ్రీ గ్యాదరి బాలమలన్న గారు మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం టీఎస్ఐపాస్ ద్వారా సింగల్ విండో పద్దతిలో కేవలం 1 నుంచి ౩౦ రోజుల్లో అన్ని అనుమతులు చేకూర్చి పెడుతుంది అని. ఎలాంటి లంచాలకు, సమయ జాప్యం లేకుండా అన్ని  పెర్మిషన్ల గరిష్టాంగా నెల రోజుల ఇస్తామని తెలియ చేసారు.

Click here for Event Gallery