ట్రంప్‌కి షాకిచ్చిన మహిళకు బంపర్‌ ఆఫర్‌
Ramakrishna

ట్రంప్‌కి షాకిచ్చిన మహిళకు బంపర్‌ ఆఫర్‌

17-11-2017

ట్రంప్‌కి షాకిచ్చిన మహిళకు బంపర్‌ ఆఫర్‌

వర్జీనియాలో గోల్ఫ్‌ ఆడేందుకు వెళ్తున్న అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్‌ ట్రంప్‌ కు మధ్యవేలు చూపించి అసహనాన్ని ప్రకటించిన జూలీ బ్రిస్క్‌ మాన్‌ కు 3,000 మంది మద్దతుగా నిలిచారు. రెండు వారాల కింద ఆమె ట్రంప్‌ కు షాకివ్వగా ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవన్న ఆందోళనతో ఆమె పని చేస్తున్న సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఆమె ఉపాధికోసం ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ఆమె ఆర్థిక అవసరాల నిర్వహణకు అకిమా అనే ప్రభుత్వ కాంట్రాక్టర్‌ సోషల్‌ మీడియా మాధ్యమంగా క్రౌడ్‌ ఫండింగ్‌ సేకరణ ప్రారంభించారు. దీంతో నెటిజన్లు ఉదారంగా స్పందించారు.