రామాయణం వీక్షించిన ట్రంప్‌, మోదీ

రామాయణం వీక్షించిన ట్రంప్‌, మోదీ

13-11-2017

రామాయణం వీక్షించిన ట్రంప్‌, మోదీ

ఆసియాన్‌ స్వర్ణోత్సవాల్లో రామాయణ సంగీత రూపకాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా ప్రధాని లీ కెఖియాంగ్‌, జపాన్‌ ప్రధాని షింజో అబే, ఆసియాన్‌ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు పాల్గొని రామయాణాన్ని వీక్షించారు. ఆసియాన్‌ స్వర్ణోత్సవాల్లో భారతీయ సంస్కృతికి పెద్దపీట వేయడంపై మోడీ ఆనందం వ్యక్తం చేశారు. భారత్‌కు ఫిలిప్పీన్స్‌తో తరాల కాలంగా సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. రామాయణాన్ని ఫిలిప్పీన్స్‌లో మహారదియా లవాన అంటారు. ఆ పదానికి రావణ అని అర్థం వస్తుంది. ఫిలిప్పీన్స్‌లో ప్రఖ్యాతి గాంచిన సింగ్‌కిల్‌ నృత్యానికి రామాయణమే ఆధారమన్న విషయం తెలిసిందే.