అమెరికాలో కాల్పులు, భారతీయుడు మృతి

అమెరికాలో కాల్పులు, భారతీయుడు మృతి

13-11-2017

అమెరికాలో కాల్పులు, భారతీయుడు మృతి

ఉత్తర కరోలినా (అమెరికా)లోని ఓ హోటల్‌ వద్ద జరిగిన కాల్పుల్లో ఆకాశ్‌ ఆర్‌ తలతి అనే ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ఆకాశ్‌ ఫయిటెవిల్లే నగరంలో నైట్స్‌ ఇన్‌, డైమెండ్స్‌ జంటిల్మెన్స్‌  క్లబ్‌ పేరుతో హోటళ్లు నిర్వహిస్తున్నారు. క్లబ్‌కు వచ్చిన మార్కెసీ డెవిట్‌ (23) అనే వ్యక్తిని ఏదో కారణం మీద సెక్యూరిటీ గార్డు బయటకు పంపించాడు. బయటకు వచ్చిన డెవిడ్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో అక్కడే ఉన్న ఆకాశ్‌ మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆకాశ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని ఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.