ఆకలి సమస్యతో కుంగుబాటు
MarinaSkies
Kizen
APEDB

ఆకలి సమస్యతో కుంగుబాటు

13-11-2017

ఆకలి సమస్యతో కుంగుబాటు

ఉబకాయం, ఆకలి లేక పోవడం వంటి సమస్యలతో మహిళలు కుంగుబాటుకు లోనయ్యే ముప్పు పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారిలో ఆల్లో ( ఫీల్‌ గుడ్‌ స్టెరాయిడ్‌) అనే స్టెరాయిడ్‌ విడుదల తగ్గిపోతుందట. దీంతో, ఆయా మహిళల్లో మానసిక ఆందోళన పెరిగి కుంగుబాటుకు లోనవుతున్నారని అమెరికాలోని  ఇల్లినాయిస్‌ వర్సిటీ ప్రొఫెసర్లు వెల్లడించారు. ఆకలి సమస్య ఉన్న మహిళల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది ఆందోళన, కుంగుబాటు సమస్యలను కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో  గుర్తించారట. మగవారిలోనూ  ఈ సమస్య  ఉన్నదని వారు తెలిపారు.