చేతులు కలిపిన అమెరికా, రష్యా

చేతులు కలిపిన అమెరికా, రష్యా

12-11-2017

చేతులు కలిపిన అమెరికా, రష్యా

సిరియా పరిపాలనా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ అనేకమంది అమాయకుల ఉసురు తీయడమే కాకుండా ప్రపంచ దేశాలకు ముప్పుగా పరిణమించిన ఐఎస్‌ఐఎస్‌ను తుదముట్టించేందుకు అమెరికా, రష్యా చేయిచేయి కలిపాయి. ఈ మేరకు రష్యా, అమెరికా ఓ అంగీకారానికి వచ్చాయి. సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రమూకపై సంయుక్తంగా పోరాటం చేయ్యాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఓ అంగీకారానికి వచ్చారని రష్యా ప్రకటించింది. వియత్నాంలోని దనంగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్‌ ఎకానామిక్‌ కో ఆపరేషన్‌ (ఏపీఈసీ) సమావేశంలో పాల్గొన్న రష్యా విదేశాంగశాఖా మంత్రి సెర్గీ లవ్‌రోవ్‌, అమెరికా సెక్రటరీ ఆఫ్‌ రెక్స్‌టిల్లర్‌సన్‌ మధ్య చర్చల అనంతరం ఈ అంగీకారం జరిగిందని వెల్లడించింది. సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ను అంతం చేసి పరిపాలన కోసం రాజకీయపరమైన చర్య తీసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించారని ప్రకటించింది. ఇదిలావుండగా ఈ ప్రకటనపై వైట్‌హౌస్‌ స్పందించలేదు. సిరియాలో ఇప్పటివరకూ అమెరికా, రష్యా వేరువేరుగా ఉగ్రవాదులను ఏరివేస్తున్న సంగతి తెలిసిందే.