ప్రధాని మోదీ బాగా పని చేస్తున్నారు : ట్రంప్
Sailaja Reddy Alluddu

ప్రధాని మోదీ బాగా పని చేస్తున్నారు : ట్రంప్

10-11-2017

ప్రధాని మోదీ బాగా పని చేస్తున్నారు : ట్రంప్

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇండో పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధి కోసం భారత్‌తో పాటు ఆ దేశ ప్రధాని మోదీ కూడా విశేషంగా కృషి చేస్తున్నారని ట్రంప్‌ కితాబిచ్చారు. వియత్నాంలో జరిగిన ఏపెక్‌ సీఈవో సదస్సులో ట్రంప్‌ మాట్లాడారు. ఏపెక్‌ కూటమిలో లేని దేశాలు కూడా ఇండో పసిఫిక్‌ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాయన్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లూ పూర్తి అవుతున్నదని, వంద కోట్ల మందితో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందన్నారు. ఇప్పుడు ఆ దేశం ఆర్థికంగానూ ఎదిగిందని, ఆర్థిక ప్రగతి బాగుటుందని,  దేశ ప్రజల శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ బాగా పనిచేస్తున్నారని, చాలా విజయవంతంగా మోదీ దూసుకెళ్లుతున్నారని ట్రంప్‌ తన సందేశంలో తెలిపారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఏ దేశంతోనైనా వాణిజ్య సంబంధాలు పెట్టుకునేందుకు అమెరికా సిద్దంగా ఉందన్నారు.