అట్లాంటాలో తానా బోన్‌మారో శిబిరం సక్సెస్‌

అట్లాంటాలో తానా బోన్‌మారో శిబిరం సక్సెస్‌

10-11-2017

అట్లాంటాలో తానా బోన్‌మారో శిబిరం సక్సెస్‌

అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోన్‌ మారో శిబిరం విజయవంతమైంది. తానా కేర్స్‌ ప్రోగ్రాంలో భాగంగా ఈ డ్రైవ్‌ను నిర్వహించారు. తానా స్వచ్ఛంద కార్యకర్తలు బోన్‌ మారో దానం చేయడం వలన కలిగే లాభాలను వివరించారు. ఆరోగ్య, విద్య, సేవా, వలస మొదలైన రంగాల్లో ప్రవాస తెలుగు వారికి సేవలందించే కార్యక్రమమే తానా కేర్స్‌. బోన్‌ మారో డ్రైవ్‌లో అట్లాంటా తానా కార్యవర్గం అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ లావు, అనిల్‌ యలమంచిలి, భర్‌ మద్దినేని, భరత్‌ అవిర్నేని,  బిల్హన్‌ ఆలపాటి, మురళి బొడ్డు, రాజేష్‌ జంపాల, వినయి మద్దినేని, శ్రీనివాస్‌ రాయపురెడ్డి, వెంకీ గద్దె, నగేష్‌ దొడ్డాక, ఉపేంద్ర నర్రా, శ్రీనివాస్‌ నిమ్మగడ్డ, ఆదిత్య గాలి, శ్రీహర్ష యెర్నేని, ఆనంద్‌ అక్కినేని తదితరులు పాల్గొన్నారు.


Click here for Event Gallery