సుబ్బారావు కొల్లాకు దక్కని విజయం

సుబ్బారావు కొల్లాకు దక్కని విజయం

10-11-2017

సుబ్బారావు కొల్లాకు దక్కని విజయం

వర్జీనియా రాష్ట్రంలోని 87వ జిల్లా ప్రతినిధిగా రిపబ్లికన్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన ప్రకాశం జిల్లా ఎన్నారై కొల్లా సుబ్బారావుకు గెలుపు లభించలేదు. కాని గుర్తింపు మాత్రం భారీగానే వచ్చింది. విజయాన్ని అందుకోలేకపోయినా అటు ఎన్నారైలలో, ఇటు అమెరికన్‌లలో తనకంటూ ఓ ఇమేజ్‌ను ఆయన సృష్టించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ బెల్‌ (18148) చేతిలో 6968 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విద్యా, ఆరోగ్య, రవాణా, వాణిజ్య రంగాలను బలోపేతం చేస్తాననే వాగ్దానాలతో ప్రచారాన్ని సాగించిన సుబ్బారావుకు ప్రవాస భారతీయులు, తెలుగువారి నుండి భారీ మద్దతు లభించింది. తెలుగువారు వర్జీనియాలో అధికంగా నివసిస్తున్నప్పటికీ స్థానికుల బలాబలాలు ఎదుట వీరి శక్తి చాలలేదు.. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధివిధానాలు, రిపబ్లికన్‌ పార్టీ పట్ల వ్యతిరేకత వంటివి కూడా సుబ్బారావుకు వ్యతిరేక పవనాలుగా వీచి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.