అధ్యక్ష ఎన్నికలలో కల్పించు కోవాలని అమెరికా చూస్తోంది

అధ్యక్ష ఎన్నికలలో కల్పించు కోవాలని అమెరికా చూస్తోంది

10-11-2017

అధ్యక్ష ఎన్నికలలో కల్పించు కోవాలని అమెరికా చూస్తోంది

రష్యా సరిహద్దు దేశమైన చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటిస్తున్నవేళ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అమెరికాపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల రష్యా క్రీడాకారులు డోపింగ్‌ పరీక్షలో పట్టుబడటం అమెరికా సృష్టించిన సమస్య అని వ్యాఖ్యలు చేశారు. ఆరుమంది క్రీడాకారులు 2014 ఒలింపిక్‌ క్రీడలలో మాదకద్రవ్యాలు వాడినట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం పేర్కొంది. ఐఓసిపై అమెరికా పట్టు ఉందని తమ క్రీడాకారులపై తప్పుడు అభియోగాలు మోపిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రష్యా హాకింగ్‌కు పాల్పడిందని నిరాధారపూరిత ఆరోపణలు చేసినట్లే తమ క్రీడాకారులపై ఇప్పుడు కుట్ర పన్నిందని అన్నారు. వచ్చే మార్చి 2018లో జరగబోయో రష్యా అధ్యక్ష ఎన్నికలలో అమెరికా కల్పించుకోవాలని కుట్ర పన్నుతోంది ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో తాను మళ్లీ పోటీ పడుతున్నదీ లేనిదీ చెప్పకుండా దాటవేసారు.