చికాగో కోర్టుకు వచ్చిన ఒబామా

చికాగో కోర్టుకు వచ్చిన ఒబామా

10-11-2017

చికాగో కోర్టుకు వచ్చిన ఒబామా

చికాగో కోర్టులో న్యాయాధిపతిగా విధులు నిర్వర్తించడానికి మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా విచ్చేశారు. అయితే ఏ కేసులోనూ విచారణకు పిలవకుండానే న్యాయమూర్తి ఆయనను పంపివేశారు. ఒబామాను ఎందుకు డిస్మిస్‌ చేశారో అధికార వివరణ లేదు. అయితే న్యాయ సేవలు అందించడానికి రావాలని పిలిచి ఏ కేసును అప్పగించకపోవడం కూడా అసాధారణమేమీ కాదు. బుధవారం ఉదయం కోర్టుకు వచ్చిన ఒబామా మధ్యాహ్నమే వెళ్ళిపోయారు. ఒకప్పుడు లా ప్రొఫెసర్‌ అయిన ఒబామాకు చికాగోలో సొంత ఇల్లు ఉంది. తమను జ్యూరీగా ఎంపిక చేసుకుంటారేమోనని కుక్‌ కౌంటీలోని డలాయ్‌ సెంటర్‌ కోర్టు హౌస్‌లో ఇతరులతో కలిసి ఒబామా కూడా వేచివున్నారు. ఒబామా కోర్టుకు మోటర్‌బైక్‌పై వచ్చారు. తనను చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న మీడియా సిబ్బందిని, కోర్టు సిబ్బందిని ఒబామా కలుసుకున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. జ్యూరీలో వుండాలనుకుని ఇక్కడకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒబామా అభినందనలు తెలిపారు. కోర్టుకు బయలుదేరడానికి ముందుగా ఒబామా మేయర్‌ ఎన్నికల ఫలితాలపై ట్వీట్‌ చేశారు. ప్రజలు ఓటు వేస్తే జరిగేది ఇదే అని ఆయన వ్యాఖ్యానించారు.