అమెరికాలో తొలి సిక్కు మేయర్‌

అమెరికాలో తొలి సిక్కు మేయర్‌

09-11-2017

అమెరికాలో తొలి సిక్కు మేయర్‌

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోనే తొలిసారి ఓ పట్టణానికి  సిక్కు మతస్థుడు మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత సంతతి చెందిన రవిందర్‌ భల్లాకు ఈ ఘనత దక్కింది. హోబోకెన్‌ పట్టణ మేయర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో మరో ఐదుగురు అభ్యర్థులను వెనక్కి నెట్టి ఆయన విజయం సాధించారు. ఏడేళ్లుగా పట్టణకౌన్సిల్‌లో రవీందర్‌ సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థులు రవిందర్‌ను ఉగ్రవాదిగా ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచడంపై దూమారం రేగింది. గెలుపుపై సంబరాలు జరుపుకొన్నారు.