లాస్‌ ఏంజిల్స్‌లో పెరిగిన నిరాశ్రయుల సంఖ్య

లాస్‌ ఏంజిల్స్‌లో పెరిగిన నిరాశ్రయుల సంఖ్య

09-11-2017

లాస్‌ ఏంజిల్స్‌లో పెరిగిన నిరాశ్రయుల సంఖ్య

లాస్‌ ఏంజిల్స్‌లో నిరాశ్రయుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోందని లాస్‌ ఏంజిల్స్‌ హోమ్‌లెస్‌ సర్వీసెస్‌ ఆథారిటి(ఎల్‌ఏహెచ్‌ఎస్‌ఏ) సంస్థ ప్రకటించింది. లాస్‌ ఏంజిల్స్‌లో 57,794 మంది నిరాశ్రయులు ఉన్నట్లు తెలిపింది. వారంతా ఆశ్రయం లేకపోవడంతో పోలీస్‌ స్టేషన్‌ అరుగులపై, మార్కెట్లు, దుకాణాల మెట్లపై నిద్రిస్తున్నారని తెలిపింది. అమెరికాలోని మహానగరాల్లోనూ నిరాశ్రయుల సమస్య వేధిస్తోందని, ప్రభుత్వం తక్షణమే నిరాశ్రయుల సమస్యలను తీర్చేందుకు కృషి చేయాలని ఎల్‌ఏహెచ్‌ఎస్‌ఏ కోరింది.