డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా ఘన స్వాగతం
Sailaja Reddy Alluddu

డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా ఘన స్వాగతం

09-11-2017

డొనాల్డ్‌ ట్రంప్‌కు చైనా ఘన స్వాగతం

ఆసియా పర్యటనలో భాగంగా చైనా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన స్వాగతం లభించింది. బీజింగ్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ దంపతులకు చైనా అధికార పార్టీ నాయకులు రెడ్‌ కార్పెట్‌ పరచి స్వాగతం పలకగా, చైనా ఆర్మీ గౌరవ వందనం సమర్పించింది. ఆ తరువాత చైనా అద్యక్షుడు షి జిన్‌పింగ్‌ ట్రంప్‌ దంపతులకు చారిత్రక ఫర్‌బిడెన్‌ సిటీ ప్యాలెస్‌లో ఆతిథ్యమిచ్చారు. అక్కడికి చేరుకున్న ట్రంప్‌ దంపతులకు జిన్‌పింగ్‌ దంపతులు స్వాగతం పలకారు. ట్రంప్‌ దంపతుల గౌరవార్థం చైనా సాంస్కృతిక కార్యక్రమం పెకింగ్‌ ఒపేరా నిర్వహించారు.