డిసెంబర్‌ 14 నుంచి టాటా సేవా దినోత్సవాలు
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

డిసెంబర్‌ 14 నుంచి టాటా సేవా దినోత్సవాలు

08-11-2017

డిసెంబర్‌ 14  నుంచి టాటా సేవా దినోత్సవాలు

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మాతృరాష్ట్రంలోని ప్రజలకు సేవలందించేందుకు డిసెంబర్‌ 14 నుంచి 23వ తేదీ వరకు సేవా దినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వర్క్‌షాప్‌లు, ఆరోగ్యశిబిరాలు, పాఠశాలల్లో డిజిటల్‌ వస్తువుల ఏర్పాటు, వీధిలైట్లకోసం సోలార్‌ పరికరాలు, మంచినీటికోసం వాటర్‌ప్లాంట్‌ల ఏర్పాటు, కంప్యూటర్‌ సిస్టమ్‌ల బహూకరణతోపాటు స్కూళ్ళలో మరుగుదొడ్ల నిర్మాణం, స్కాలర్‌షిప్‌లు వంటి కార్యక్రమాలను సేవా దినోత్సవాల్లో చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం మీ స్కూల్‌ను, లేదా మీ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఎన్నారైలను టాటా కోరింది. ఈ కార్యక్రమానికి సంబంధించి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న వంశీరెడ్డిని 410 948 5976, కో కో ఆర్డినేటర్‌లుగా ఉన్న జ్యోతిరెడ్డిని 602 384 4858, వెంకట్‌ ఎక్కాను 734 674 5060, ఓవర్సీస్‌ కో ఆర్డినేటర్‌ ద్వారకనాథ్‌రెడ్డి 98480 44747లో సంప్రదించవచ్చు.

సేవాదినాల్లో భాగంగా డిసెంబర్‌ 24న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోజు ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ నుంచి డ్రగ్స్‌ వద్దు అంటూ నడక కార్యక్రమాన్ని కూడా టాటా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ సేవాదినాలకు అడ్వయిజర్లుగా డా. మోహన్‌ పాటలోళ్ల, భరత్‌ రెడ్డి మందాడి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని టాటా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పిలుపునిచ్చింది. కమిటీ సభ్యులు ఝాన్సిరెడ్డి (ప్రెసిడెంట్‌), భరత్‌ మందాడి (ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌), అనిల్‌ ఎర్రబెల్లి (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌), మహేష్‌ ఆదిభట్ల (ట్రెజరర్‌), విక్రమ్‌ జంగం (సెక్రటరీ), డా రామారెడ్డి మల్లాది (జాయింట్‌ సెక్రటరీ)తోపాటు, అడ్వయిజరీ కౌన్సిల్‌ సభ్యులు డా. పైళ్ల మల్లారెడ్డి (చైర్‌), డా. హరనాథ్‌ పొలిచెర్ల (కో చైర్‌), సభ్యులు డా. మోహన్‌ పాటలోళ్ళ, డా. విజయపాల్‌ రెడ్డి, డా. సుధాకర్‌ విద్యాల, శ్రీనివాస్‌ అనుగు (సెక్రటరీ) సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అందరూ కృషి చేయాలని కోరారు.