టెక్సాస్‌లో జరిగిన నాటా బోర్డ్‌ మీటింగ్‌
MarinaSkies
Kizen
APEDB

టెక్సాస్‌లో జరిగిన నాటా బోర్డ్‌ మీటింగ్‌

06-11-2017

టెక్సాస్‌లో జరిగిన నాటా బోర్డ్‌ మీటింగ్‌

టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో నవంబర్‌ 3, 4వ తేదీల్లో ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) బోర్డ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాటా అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి గంగసాని అధ్యక్షత వహించారు. ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ రాఘవరెడ్డి గోశాల, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ రెడ్డి కొర్సపాటి, సెక్రటరి శ్రీకాంత్‌ రెడ్డి పెనుమాడ, ట్రెజరర్‌ చినబాబు రెడ్డితోపాటు నాటా ప్రముఖులు జితేందర్‌ రెడ్డి, ఎవిఎన్‌ రెడ్డి, రమణారెడ్డి క్రిస్టపాటి, ఎస్‌విఆర్‌ రెడ్డి, బాలారెడ్డి ఇందుర్తి, వెంకటరమణ రెడ్డి మురారి, సోమశేఖర్‌ రెడ్డి, ప్రశాంతి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో నాటా ఆధ్వర్యంలో నిర్వహించనున్న సేవా దినాలు, కన్వెన్షన్‌తోపాటు ఇతర విషయాలను ఇందులో చర్చించారు.

Click here for Event Gallery