కాలిఫోర్నియాలో ఘనంగా అతిరుద్ర మహాయాగం

కాలిఫోర్నియాలో ఘనంగా అతిరుద్ర మహాయాగం

06-11-2017

కాలిఫోర్నియాలో ఘనంగా అతిరుద్ర మహాయాగం

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్‌ సిద్ధివినాయక కల్చరల్‌ సెంటర్‌లో అతి రుద్ర మహాయాగం ఘనంగా జరిగింది. అక్టోబరు 26న మొదలైన ఈ యాగం నవంబర్‌ 5న ముగిసింది. సారవంతమైన పుట్టమట్టితో శివలింగాలు తయారు చేసి, లోక కల్యాణం, శివానుగ్రహం లక్ష్యంగా నిర్వహించిన ఈ మహాయాగంలో వెస్ట్‌ కోస్ట్‌ కు చెందిన 125 మంది శివారాధకులు పాల్గొన్నారు. వారిలో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, డాక్టర్లే కావడం విశేషం. సిద్ధివినాయక దేవాలయం సంస్థాపకుడు, ప్రధాన అర్చకుడు ఉమ శంకర్‌ దీక్షిత్‌ ఆధ్వర్యంలో 121 మంది రుత్విక్కులు నిర్వహించిన ఈ యాగాన్ని చూసేందుకు అమెరికా నలుమూలల నుంచీ భక్తులు తరలివచ్చారు.