ఒకే రోజు రెండు సార్లు అదృష్టం

ఒకే రోజు రెండు సార్లు అదృష్టం

06-11-2017

ఒకే రోజు రెండు సార్లు అదృష్టం

అమెరికాలో ఓ మహిళను ఒకే రోజు అదృష్టం రెండు సార్లు వరించింది. ఉత్తర కరోలినాలో ఇటీవల డైమండ్‌ డ్యాజ్లర్‌ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన కింబర్లీ మోరిస్‌ రూ.6.4 లక్షల నగదును గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని స్వీకరించిన అమె, వెంటనే  రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రూ.1300 వెచ్చించి మరో టికెట్‌ కొనుగోలు చేశారు. దీనికి రూ.6.47 కోట్ల నగదు బహుమతి తగలడంతో, ఆమె ఆనందం పదింతలైంది. విడతలవారీగా కాకుండా ఒకేసారి నగదు మొత్తాన్ని తీసుకోవాలని ఆమె నిర్ణయించుకోవడంతో పన్నులు పోనూ రూ.2.5 కోట్లు ఆమె ఖాతాకు చేరాయి. పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటానని తానెప్పుడూ కల కనేదాన్నని, అందుకే రెండు టికెట్‌ కొన్నానని కింబర్లీ చెప్పారు.