టెక్సాస్‌లో కాల్పులు

టెక్సాస్‌లో కాల్పులు

06-11-2017

టెక్సాస్‌లో  కాల్పులు

అమెరికాలోని టెక్సాస్‌లో ఓ చర్చిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతాదళాలు హతమార్చాయి. ఆగ్నేయ అమెరికాలోని సదర్‌లాండ్‌ స్రింగ్స్‌  ప్రాంతంలోని ఓ చర్చిలోకి దుండగుడు చొరబడి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ఘటనతో అమెరికాలో హై అలర్ట్‌ ప్రకటించారు. చర్చికి అనుసంధానమై ఉన్న అన్ని రహదారులను పోలీసులు తమ అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.