అమెరికా ఫస్ట్‌ లేడీ చుట్టూ ఆడ పోలీసులే

అమెరికా ఫస్ట్‌ లేడీ చుట్టూ ఆడ పోలీసులే

04-11-2017

అమెరికా ఫస్ట్‌ లేడీ చుట్టూ ఆడ పోలీసులే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా టూర్‌ మొదలైంది. ఆయనతో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ కూడా ఈ టూర్‌కు వెళ్తున్నారు. ట్రంప్‌ అడ్వైజర్‌ ఇవాంకా ట్రంప్‌ కూడా ఇప్పటికే జపాన్‌ చేరుకున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా అమెరికా ఫస్ట్‌ లేడీకి ప్రత్యేక భద్రతా పోలీసులను ఏర్పాటు చేశారు. వాళ్లంతా మహిళలే కావడం విశేషం. ట్రంప్‌, ఆయన భార్య మెలానియా ఆదివారం టోక్కో చేరుకోనున్నారు. అయితే జపాన్‌లో పర్యటిస్తున్న సమయంలో ఆ దేశ మహిళా భద్రతాధికారులు మెలానియా, ఇవాంకాకు ప్రత్యేక భద్రతను కల్పించనున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా సిబ్బంది పర్యవేక్షణలోనే మెలానియా, ఇవాంకాలు జపాన్‌లో టూర్‌ చేస్తారు. ఈ ఇద్దరి చుట్టూ మొత్తం ఆడ భద్రతా సిబ్బందే ఉంటుంది. ఈ టీమ్‌లో ఒక మగ పోలీసులు కూడా ఉండరు. ఈ నేపథ్యంలో ఫిమేల్‌ పోలీస్‌ స్కాడ్‌ టోక్కోలో మీడియా ముందు ప్రత్యేక ప్రదర్శ ఇచ్చారు. బ్లాక్‌ షూట్‌తో వాళ్లు ఓ డ్రిల్‌ చేశారు. అతిథులను అట్రాక్ట్‌ చేస్తున్నట్టుగా ఉండే విధంగానే  మహిళా పోలీసులకు డీసెంట్‌ డ్రెస్‌ కోడ్‌ను డిజైన్‌ చేశారు.