ట్రంప్‌ సర్కారులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి

ట్రంప్‌ సర్కారులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి

04-11-2017

ట్రంప్‌ సర్కారులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారులో మరో భారతీయ అమెరికన్‌కు కీలక పదవి దక్కింది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి అమెరికా విదేశాంగశాఖ సహాయ మంత్రిగా ప్రముఖ న్యాయవాది మనీషా సింగ్‌ నియామకానికి సెనేట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఆమె దేశ ఆర్థిక దౌత్యవ్యవహారాలకు ఇన్‌ఛార్జి కానున్నారు. సెనేటర్‌ డాన్‌ సలివన్‌కు ముఖ్య న్యాయవాదిగా, సీనియర్‌ విధాన సలహాదారుగా మనీషా ఇప్పటివరకు నిధులు నిర్వర్తించారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ వాసి అయిన మనీషా, బాల్యంలోనే తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడా వెళ్లి స్థిరపడ్డారు.