భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్‌

భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్‌

04-11-2017

భారత్‌లో అమెరికా రాయబారిగా జస్టర్‌

భారత్‌లో అమెరికా రాయబారిగా కెన్నెత్‌ జస్టర్‌ నియామకాన్ని సెనేట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి ఖాళీగా ఉన్న కీలక స్థానాన్ని భర్తీ చేసినట్లుయింది. 62 ఏళ్ల జస్టర్‌కు భారత్‌లో ఆర్థిక వ్యవహారాలపై మంచి పట్టు ఉంది. భారత్‌-అమెరికాల మధ్య పౌర అణు ఒప్పందం కుదరడంలో ఆయన కీలక పాత్ర  పోషించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, భారత్‌లో అమెరికా రాయబారిగా ఉన్న రిచర్డ్‌ వర్మ ఈ ఏడాది జనవరి 20న తన పదవికి రాజీనామా చేశారు.