డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటన ?

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటన ?

04-11-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసియా పర్యటన ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నవంబర్‌ 5 నుంచి 14 వరకు జపాన్‌, దక్షిణ కొరియా, చైనాల్లో పర్యటించనున్నారు. ఆ తర్వాత వియత్నాం, ఫిలిప్పైన్స్‌లకు వెళ్తారు. ఉత్తర కొరియాతో ఉన్న అణు ముప్పు దృష్ట్యా యూఎస్‌తో ఆసియన్‌ దేశాల ద్వైపాక్షిక, వాణిజ్య, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశంగా కనబడుతోంది. ఆసియా దేశాల నేతలతో జరిగే సమావేశాల్లో సైతం ఈ అంశమే ప్రధానంగా చర్చకు రావొచ్చు. 12 దేశాల ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్‌షిప్‌(టీపీపీ) పై అమెరికా విధానం ఎలా ఉండబోతోందనే దానిపైనా ఆసక్తి నెలకొంది.

ట్రంప్‌ అధ్యక్షుడైన నెలరోజుల్లోనే అమెరికా దీనినుంచి వైదొలగుతున్నట్టు ఆయన ప్రకటించారు. మూడురోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న ట్రంప్‌, ప్రధాని షింజోఅబేతో సమావేశమవుతారు. అబే ప్రాతిదిస్తున్న అబేనా మిక్స్‌ ప్యాకేజీ అమలుకు టీపీపీలో అమెరికా కొనసాగడం చాలా ముఖ్యమని జపాన్‌ నాయకత్వం భావిస్తోంది. దక్షిణ కొరియాలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. అమెరికాతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, కోరస్‌ నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చకు రావొచ్చు. ఉత్తర  కొరియాతో ఉన్న ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా కూడా ఈ ఒప్పందం అవసరమే.