ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌గా జెరోమ్‌ పావెల్‌

ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌గా జెరోమ్‌ పావెల్‌

04-11-2017

ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌గా జెరోమ్‌ పావెల్‌

అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వు నూతన చైర్మన్‌గా జెరోమ్‌ పోవెల్‌ (64) ఎన్నికయ్యారు. ఈయనను అమెరికా అద్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. జే గా కూడా పిలిచే జెరోమ్‌కు అపార జ్ఞానం, మేధస్సు ఉందని, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న అమెరికా మరింత ముందడుగు వేసే విధంగా ఈయన మార్గనిర్దేశం చేయగలరని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఫెడ్‌ చైర్మన్‌గా జానెట్‌ యెలెన్‌ ఉన్నారు. ఈమె పదవీకాలం వచ్చే ఫిబ్రవరిలో ముగియనుంది. ఫెడ్‌ రిజర్వుకు సారథ్యం వహించిన మొదటి మహిళ ఈమె. అయితే యెలెన్‌ పున నియామకానికి ట్రంప్‌ ఆసక్తి కనబరచలేదు. గత నాలుగేళ్ల కాలంలో ఈ పనితీరు ప్రశంసనీయంగానే ఉంది. అయినప్పటికీ ఈమెను కొనసాగించడానికి ట్రంప్‌ విముఖత చూపారు.