డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

03-11-2017

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌కు గుడ్‌ బై చెప్పారా? గురువారం రాత్రి ఆయన అకౌంట్‌ కోసం చూసిన వారు ట్విట్టర్‌ ఇచ్చిన మెసేజ్‌ చూసి షాక్‌ తిన్నారు. ట్విటర్‌లో ట్రంప్‌ పేరు టైప్‌ చేసి చూస్తే పేజ్‌ లేనట్లు చూపించిందట. దీంతో ఆయన ఫాలోవర్లు షాక్‌ తిన్నారు. దీనిపై వెంటన స్పందించిన ట్విట్టర్‌, అది ట్విట్టర్‌ ఎంప్లాయీ చేసిన మానవ తప్పిదం వల్ల జరిగిందని వివరణ ఇచ్చింది. 11 నిమిషాల పాటు ఆయన అకౌంట్‌ కనిపించకుండా పోయింది. ఇది ఓ ఉద్యోగి చేసిన తప్పిదం. ఇప్పుడు ఆయన అకౌంట్‌ యాక్టివ్‌గా ఉంది అని ట్విట్టర్‌ అధికారు ఒకరు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగ్గిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌ సృష్టం చేసింది.