సత్య నాదెళ్ల భారత్‌ పర్యటన

సత్య నాదెళ్ల భారత్‌ పర్యటన

03-11-2017

సత్య నాదెళ్ల భారత్‌ పర్యటన

మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్ల తన పుస్తకం హిట్‌ రిఫ్రెష్‌ ప్రమోషన్‌ కోసం ఈ నెల 5-6 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నాదెళ్ల హైదరాబాద్‌, ఢిల్లీలో ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, విద్యావేత్తలతో జరిగే పలు కార్యక్రమాలో పాల్గొంటారు. ఇంకా భారత్‌లో ఖాతాదారులతోనూ భేటీ అవుతారని మైక్రోసాఫ్ట్‌ కంపెనీ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ముందు మాట రాసిన హిట్‌ రిఫ్రెష్‌ ఇంగ్లీషు పుస్తకం డిసెంబరులో తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.