ఆ నరహంతకుడికి మరణదండనే సరైనది
Ramakrishna

ఆ నరహంతకుడికి మరణదండనే సరైనది

03-11-2017

ఆ నరహంతకుడికి మరణదండనే సరైనది

న్యూయార్క్‌ నగరంలో ట్రక్‌తో ఢీకొట్టి ఎనిమిదిమందిని పొట్టనపెట్టుకున్న సెపుల్లో సైపోవ్‌ (ఉజ్బెకిస్థాన్‌)కు మరణ దండన విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థ ఐసిస్‌ భావజాలాన్ని జీర్ణించుకున్న 29 ఏళ్ల సైపోవ్‌ న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద ట్రక్‌తో ఢీకొనడంతో ఎనిమిది మంది మరణించగా సుమారు డజను మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఐసిస్‌ జెండాను తాను చికిత్స పొందుతునన ఆస్పత్రి గదిలో ఎగరవేయాలని కోరిన ఈ నరహంతకుడికి మరణ శిక్ష విధించాలని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.