గ్రీన్‌కార్డు లాటరీ విధానాన్నిరద్దు చేస్తాం

గ్రీన్‌కార్డు లాటరీ విధానాన్నిరద్దు చేస్తాం

03-11-2017

గ్రీన్‌కార్డు లాటరీ విధానాన్నిరద్దు చేస్తాం

న్యూయార్క్‌ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ వలస విధాన చట్టాలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గ్రీన్‌కార్డు లాటరీ విధానాన్ని రద్దుచేసి ప్రతిభ ఆధారిత వీసాలు, గ్రీన్‌ కార్డులు విధానాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. న్యూయార్క్‌ ఘటనకు పాల్పడ్డ ఉగ్రవాది సైపుల్లో  వైవిద్య లాటరీ విధానం (డైవర్శిటీ లాటరీ ప్రోగ్రామ్‌) ద్వారా అమెరికాలోకి ప్రవేశించి 8 మంది మృతికి, 11 మంది తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యాడని, ఇటువంటి వారిని ఇక దేశంలోకి అనుమతించకూడదంటే ఈ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.

న్యూయార్క్‌ ఉగ్రవాద దాడి జరగడానికి వైవిద్య లాటరీ విధానమే కారణమని ఆయన తెలిపారు. ఈ విధానాన్ని రద్దు చేయాలంటే విపక్ష డెమోక్రటిక్‌ పార్టీ సభ్యులు అడ్డుపడుతున్నారని ట్రంప్‌ విమర్శించారు. వైవిద్య లాటరీ విధానాన్ని రద్దు చేసే ప్రక్రియను తాను ఇప్పటి నుంచే ప్రారంభిస్తానని ఆయన మీడియాతో తెలిపారు. ఉగ్రవాద దాడికి పాల్పడిన వ్యక్తులను సత్వరమే కఠినంగా శిక్షించేలా బలమైన చట్టాలను రూపొందించాల్ని అవసరం ఉందని కూడా ట్రంప్‌ తెలిపారు. తక్షణమే నిందితులను శిక్షించేలా చట్టాన్ని రూపొందించాలని తాను కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెడతానని అన్నారు.