శక్తివంతమైన మహిళల జాబితాలో ఐదుగురు మనోళ్లు

శక్తివంతమైన మహిళల జాబితాలో ఐదుగురు మనోళ్లు

03-11-2017

శక్తివంతమైన మహిళల జాబితాలో ఐదుగురు మనోళ్లు

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన శక్తివంతమైన మహిళల జాబితాలో ఐదురుగు భారతీయ మహిళలు చోటు దక్కించుకున్నారు. జర్మన్‌ ఛాన్స్‌రల్‌ ఏంజెలా మెర్కెల్‌ అగ్రస్థానంలో వున్న ఈ జాబితాలో బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా, ఐసిఐసిఐ బ్యాంక్‌ సిఇఓ, ఎండీ చందా కొచ్చార్‌ తదితరులున్నారు. ఈ జాబితాలో కొచ్చర్‌కు 32వ స్థానం లభించగా హెచ్‌సిఎల్‌ సిఇఓ రోషిణీ నాడార్‌ మల్హోత్రాకు 57వ స్థానం, బయోకాన్‌ వ్యవస్థాపక చైర్మన్‌ కిరణ్‌ మజుందార్‌కు 71వ స్థానం, హిందుస్థాన్‌ టైమ్స్‌ ఇండియా సంపాదక వర్గ డైరెక్టర్‌, చైర్‌పర్సన్‌ శోభనా భాటియాకు 92వ స్థానం, బాలీవుడ్‌ నటి ప్రియాకం చోఫ్రాకు 97వ స్థానం లభించింది. వీరితో పాటు భారత సంతతికి చెందిన పెప్సికో సిఇఓ ఇంద్రా నూయికి 11వ స్థానం, ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీల హెలీకి 43వ స్థానం దక్కాయి.