హెచ్1బీ ఉద్యోగుల వేతన సవరణ
Sailaja Reddy Alluddu

హెచ్1బీ ఉద్యోగుల వేతన సవరణ

02-11-2017

హెచ్1బీ ఉద్యోగుల వేతన సవరణ

హెచ్1 బీ వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసా ఉన్న ఉద్యోగులకు కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలని నిర్ణయించింది.  ఈ ఏడాది మార్చి 31న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) రీసెర్చ్ అసిస్టెంట్స్ కు - పెద్ద సంస్థల్లో ఇంటర్న్షిప్ చేస్తున్న వారికి మినహా హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూన్ 30వ తేదీన అక్కడి కార్మికశాఖ హెచ్1బీ వీసా పొందేందుకు ఉండాల్సిన జీతం పరిమితిని భారీగా పెంచేసింది.  ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా గతంలో హెచ్1బీ ఉద్యోగులకు 60వేల డాలర్ల కనీస వేతనానికి రోజులు చెల్లినట్లేనని చాలా యాజమాన్యాలు భావిస్తున్నాయి. మరోవైపు.. తాజా నిబంధనల మేరకు తమ వేతనాలు పెంచాలని హెచ్1బీ ఉద్యోగులు తమ యాజమాన్యాలను కోరుతున్నారు. ఏది ఏమైనా ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగులకు ఆనందం కలిగిస్తోంది. తాజా వేతన సవరణలు వచ్చే ఏడాది జూన్ 30వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితి మేరకు మార్పులు చోటుచేసుకునే అవకాశముంది.