అమెరికాలో మరో ఉగ్రదాడి ...
MarinaSkies
Kizen

అమెరికాలో మరో ఉగ్రదాడి ...

01-11-2017

అమెరికాలో మరో ఉగ్రదాడి ...

అమెరికాలో మరోసారి ఉగ్రదాడి జరిగింది. న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సమీపంలో ఓ ట్రక్‌ రోడ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పాదచారులపైకి ట్రక్‌ దూసుకెళ్లింది. ప్రమాదాన్ని ఉగ్రదాడిగా భావిస్తున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు న్యూయార్క్‌ పోలీసులు ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు.

ఇది ఉగ్రదాడిగానే  భావిస్తున్నట్లు న్యూయార్క్‌ పోలీసులు పేర్కొన్నారు. ఓ వ్యక్తి పెద్దగా అరుస్తూ పాదచారులను ఢీ కొట్టాడాని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయినవారిలో అర్జెంటీనాకు చెందిన పౌరులు ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ట్రక్‌ ఢీకొన్న వాహనాల్లో ఒక స్కూల్‌ బస్సు కూడా ఉంది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.

సెస్టెంబర్‌ 2011 తర్వాత న్యూయార్క్‌ రాష్ట్రంలో ఇదే అతిపెద్ద దాడిగా న్యూయార్క్‌ పోలీసులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఉజికిస్తాన్‌కు చెందిన సైపుల్లాగా గుర్తించారు. 2010లో అమెరికాకు వచ్చిన ఆయనకు గ్రీన్‌ కార్డు కూడా ఉందని చెప్పారు. ట్రక్కును న్యూజెర్సీ నుంచి ఓ డిపోనుంచి అద్దె కుతెచ్చి దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు. మరోవైపు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఇలాంటి చర్యల్ని సహించబోమంటూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవుడు, దేశం మీ వెంటే ఉందని ట్వీట్‌ చేశారు.