చికాగోలో గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సు జయప్రదం

చికాగోలో గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సు జయప్రదం

01-11-2017

చికాగోలో గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సు జయప్రదం

చికాగోలోని ఇండియన్‌ కాన్సులేట్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఇఎస్‌సి) ఆధ్వర్యంలో గ్లోబల్‌ సాఫ్ట్‌ సదస్సును ఇటీవల నిర్వహించారు. ఈ సదస్సుకు దాదాపు 100 మందికిపైగా ఐటీ ప్రొఫెషనల్స్‌ హాజరయ్యారు. ఇఎస్‌సి చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి, ఇండియా సాఫ్ట్‌, గ్లోబల్‌ సాఫ్ట్‌ కమిటీ చైర్మన్‌ నళిన్‌ కోహ్లీ, ఇఎస్‌సి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి.కె. సరీన్‌, కాన్సల్‌ (కామర్స్‌) ఓ.పి. మీనా తదితరులు ఇందులో పాల్గొన్నారు. కాన్సుల్‌ జనరల్‌ నీతా భూషణ్‌ కీనోట్‌ అడ్రస్‌ ఇచ్చారు. ఇండియాలో ఐటీకి ఉన్న అవకాశాలపై ఇఎస్‌సి ప్రతినిధులు వివరించారు.