అమెరికా ఎన్నికల్లో జోక్యం లేదు

అమెరికా ఎన్నికల్లో జోక్యం లేదు

01-11-2017

అమెరికా ఎన్నికల్లో జోక్యం లేదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ దేశం ప్రమేయం కల్పించుకొన్నట్లు రుజువులు లేవని రష్యా విదేశాంగ మంత్రి ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ సహాయకులు ముగ్గురిపై ఆరోపణల దర్యాప్తు వేగం పుంజుకొన్న సందర్భంగా రష్యా ఈ వ్యాఖ్యలు చేసింది. కేవలం అమెరికా ఎన్నికలలోనే కాకుండా ఇతర దేశాల ఎన్నికల్లో కూడా తాము జోక్యం కల్పించుకొన్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి సెర్గీ లోవ్రోవ్‌ తెలిపారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయడానికి రష్యా ప్రయత్నించలేదని ఆయన సృష్టం చేశారు.