అట్లాంటాలో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జన్మభూమి సదస్సు

అట్లాంటాలో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జన్మభూమి సదస్సు

31-10-2017

అట్లాంటాలో అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జన్మభూమి సదస్సు

అక్టోబర్ 27న అట్లాంటాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జన్మభూమి సదస్సు విజయవంతంగా జరిగింది. స్థానిక చెన్నై ఎక్సప్రెస్ రెస్టారెంట్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారు, ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం గారు, పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు, తానా అధ్యక్షులు వేమన సతీష్ గారు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు, విద్యాశాఖ సలహాదారు డా. ఈదర వెంకట్ గారు, తెలుగుదేశం పార్టీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ లాలం భాస్కర్ గారు, రామినేని ఫౌండేషన్ చైర్మన్  రామినేని ధర్మప్రచారక్ గారు తదితరులు పాల్గొన్నారు.

ముందుగా గద్దె వెంకీ స్వాగతోపన్యాసం చేస్తూ ఈ సదస్సుకు హాజరైన సుమారు 250 మంది అట్లాంటా వాసులకు సాదర స్వాగతం పలికారు. తదనంతరం అతిధులందరిని పరిచయం చేస్తూ వేదిక మీదకు ఆహ్వానించగా, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం మొదలైంది. తానా కార్యదర్శి లావు అంజయ్య చౌదరి గారు అతిధులందరితో తనకున్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆధ్వర్యంలో జన్మభూమికి సహాయపడే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది అన్నారు. తర్వాత అట్లాంటా సమన్వయకర్తలు రవి కిరణ్ మువ్వా మరియు సురేష్ ధూళిపూడి జన్మభూమి కార్యక్రమాలైన డిజిటల్ తరగతులు, అంగన్వాడీ కేంద్రాలు మరియు మహాప్రస్థానం గురించి వీడియో ప్రదర్శన ద్వారా సభికులందరికి వివరించారు.

కోమటి జయరాం గారు ప్రసంగిస్తూ మన ఎన్నారైలకు ప్రత్యేక గుర్తింపునిస్తున్న చంద్రబాబునాయుడు గారికి, అలాగే మాతృభూమి ఋణం తీర్చుకునేదిశగా అందరు తమ తమ ఊళ్ళకి మరియు పాఠశాలలకు తమ వంతు సహాయసహకారాలు అందించవలసిందిగా కోరారు. గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ని ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మరియు నాలెడ్జి స్టేట్ గా అభివృద్ధి పధంలో తీసుకువెళ్లే భాగంగా ఎన్నారైల కోసం 70:30 నిష్పత్తిలో అందిస్తున్న సహకారాన్ని మరింతగా వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోరారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ చదువుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మంచి స్థాయిలో ఉన్న మీరు మీ మీ గ్రామాలలో అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. వేమన సతీష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిలో తానా పాత్రను వివరించి ఇక ముందు కూడా తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని ఘంటాపధంగా తెలిపారు. అలాగే పాతూరి నాగభూషణం గారు చెప్పిన పిట్టకథ అందరిని ఆలోచింపజేసింది. అలాగే ఆటా అధ్యక్షులు అసిరెడ్డి కరుణాకర్ గారు మరియు మన అట్లాంటా వాస్తవ్యులు నాదెళ్ల రణకుమార్ గారు  తదితరులు ప్రసంగించారు.

అప్పలాచియాన్ రాష్ట్ర  విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డా. హావెల్ కెవిన్ గారు తమ విశ్వవిద్యాలయం తరపున జ్ఞాపిక మరియు సర్టిఫికెట్ గంటా శ్రీనివాసరావు గారికి అందజేశారు. తర్వాత డిజిటల్ తరగతులకు తమ గ్రామాల్లో సహాయం చేసిన దేవరపల్లి కిషోర్, గంప కృష్ణ, గద్దె వెంకీ తదితరులు తమ అనుభవాలను పంచుకున్నారు. తదనంతరం అతిధులందరిని అట్లాంటా ప్రజానీకం శాలువాలతో సత్కరించారు. డిసెంబర్ 31 లోపు తమ స్కూల్స్ కి సహాయం చేసినవారికి డెల్టా ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ తరపున 1:1 నిష్పత్తిలో మాచింగ్ చేస్తానని లావు శ్రీనివాస్ గారు అప్పటికప్పుడు ప్రకటించడం కొసమెరుపు. తనని ఆదర్శంగా తీసుకొని కొంతమంది అప్పటికప్పుడు ముందుకురావడం హర్షణీయం.

ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించిన మేదరమెట్ల మల్లిక్, యలమంచిలి అనిల్, మద్దినేని భరత్, రాయపురెడ్డి శ్రీనివాస్, బొడ్డు మురళి, మద్దినేని వినయ్, జంపాల రాజేష్, మీసాల వెంకట్, యెర్నేని హర్ష, మద్ది రామ్,  మందపాటి రాజు, దొడ్డాక నగేష్, గాలి ఆదిత్య, రాయపాటి శత్రుజ్ఞ, మోహన్ ఈదర, అక్కినేని ఆనంద్, ఎనుముల ఇన్నయ్య, ఆలపాటి బిల్హన్, నర్రా ఉపేంద్ర, అలాగే చెన్నై ఎక్సప్రెస్ రెస్టారెంట్ యాజమాన్యానికి, సదస్సుకు విచ్ఛేసిన అట్లాంటా ప్రజానీకానికి గద్దె వెంకీ కృతఘ్నతలు తెలియజేసారు. చివరగా విందు భోజనాలతో కార్యక్రమం ముగిసింది.

Click here for Event Gallery