వైట్ హౌస్ లో ఘనంగా హాలోవీన్ వేడుకలు

వైట్ హౌస్ లో ఘనంగా హాలోవీన్ వేడుకలు

31-10-2017

వైట్ హౌస్ లో ఘనంగా హాలోవీన్ వేడుకలు

అమెరికా అధ్యక్షసౌధం వైట్‌హౌస్‌లో హాలోవీన్‌ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక జరుపుకుంటున్న మొదటి హాలోవీన్‌ ఇది. ఈ పండగను దాదాపు 6000 ల మంది చిన్న పిల్లలు, పెద్దలతో కలిసి ట్రంప్‌ దంపతులు జరుపుకున్నారు. హాలోవీన్‌ పండగకు ఒకరోజు ముందుగానే (అక్టోబర్‌ 30) వైట్‌హౌస్‌ సౌత్‌ లాన్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. వర్జీనియా, మేరీల్యాండ్‌, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా రాష్ట్రాల్లోని 20  పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రకరకాల వేషధారణల్లో పిల్లలందరినీ డొనాల్డ్‌ ట్రంప్‌, మెలానియాలు సాదరంగా ఆహ్వానించారు. హాలోవీన్‌ పండగకు అనుగుణంగా రకరకాల భయంకరమైన బొమ్మలు, గుమ్మడికాయలతో ప్రాంగణాన్ని అలకరించారు. పిల్లలందరికీ బహుమతులను పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు.