అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం... బయటపెట్టిన ఫేస్‌బుక్‌
Sailaja Reddy Alluddu

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం... బయటపెట్టిన ఫేస్‌బుక్‌

31-10-2017

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం... బయటపెట్టిన ఫేస్‌బుక్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం ఆరోపణలను బలపర్చే ఆధారాలను ఫేస్‌బుక్‌ బయటపెట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రష్యా ఏజెంట్లు ఏ స్థాయిలో పనిచేశారో బహిర్గతం చేసింది. 2015 నుంచి 2017 ఆగస్టు మధ్యలో రష్యా ఏజెంట్లు దాదాపు 80,000 పోస్టులను ఫేస్‌బుక్‌ అప్‌లోడ్‌ చేశారు. 12.6 కోట్ల మంది అమెరికన్లు ఈ పోస్టులను వీక్షించారు. వీటిల్లో చాలావరకు సామాజిక విచ్ఛిన్నం సృష్టించేవి, రాజకీయ సందేశాలు ఉన్నాయని ఫేస్‌బక్‌ పేర్కొంది. సెనేట్‌లో విచారణ సందర్భంగా ఫేస్‌బక్‌ ఈ విషయాల్ని వెల్లడించింది. ఈ పోస్టులన్నీ రష్యాకు చెందిన ఓ కంపెనీ చేయించినుట్ల పేర్కొంది. ఈ కంపెనీకి క్రెమ్లిన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ప్రముఖ వార్తసంస్థ రాయిటర్స్‌ వెల్లడించింది.

గూగుల్‌ను కూడా రష్యా హ్యాకర్లు అద్భుతంగా వాడుకున్నారు. అమెరికా ఎన్నికల కోసం మొత్తం 14 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఏర్పాటు చేసి దాదాపు 1000 వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. ఈ విషయాన్ని గూగుల్‌ స్యయంగా తెలిపింది. ఇక ట్విటర్‌ గుర్తించి సస్పెండ్‌ చేసిన మొత్తం 2,752 ఖాతాలు రష్యాకు చెందిన ఓ ఇంటర్నెట్‌ ఏజెన్సీకి చెందినవిగా తేలింది.