ఎన్నారైల జన్మభూమి సేవలను ప్రశంసించిన మంత్రి గంటా

ఎన్నారైల జన్మభూమి సేవలను ప్రశంసించిన మంత్రి గంటా

31-10-2017

ఎన్నారైల జన్మభూమి సేవలను ప్రశంసించిన మంత్రి గంటా

విద్యారంగంలో పెట్టుబడులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు, విదేశాల్లో చదువుకుంటున్న ఎపి విద్యార్థులకు ఉపయోగపడేలా అమెరికన్‌ యూనివర్సిటీలతో ఒప్పందాలు వంటి కార్యక్రమాల కోసం అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ ఆద్యితనాథ్‌ దాస్‌తో కలిసి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి కూడా వారితో కలిసి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. న్యూజెర్సిలో జరిగిన ఎపి జన్మభూమి కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, జన్మభూమి అభివృద్ధికి ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్‌ సెంటర్‌గా అభివృద్ధిపరచాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని, అందులో భాగంగానే పాఠశాలల్లో విద్యాభివృద్ధితోపాటు, అమెరికాలోని విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు చెప్పారు.

ఎపి ప్రభుత్వ ప్రతినిధి జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలకు అనుగుణంగా నవ్యాంధ్ర ప్రదేశ్‌ అభివృద్ధిలో ఎన్నారైల భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఎపి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులను ఏర్పాటు చేస్తున్నామని, అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు, శ్మశానవాటికల అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంతోమంది ఎన్నారైలు పాలుపంచుకునేందుకు ముందుకురావడం అభినందనీయమని చెప్పారు. అనంతరం ఎపి జన్మభూమి సమన్వయకర్తలు పైలా ప్రసాదరావు, జోగినాయుడు, గొంప కృష్ణలను మంత్రి సన్మానిస్తూ అభినందించారు.

అమెరికాలో మన చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడంలో 'పాఠశాల' చేస్తున్న కృషిని మంత్రి గంటా ప్రశంసించారు. పాఠశాల న్యూజెర్సి ఏరియా డైరెక్టర్‌ రామ్‌మోహన్‌ వేదాంతం, ఫిలడెల్ఫియా పాఠశాల డైరెక్టర్‌ నాగరాజు నలజుల, వర్జీనియా పాఠశాల డైరెక్టర్‌ శ్రావ్య బయ్యన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల పోస్టర్లను కూడా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో మంత్రితోపాటు న్యూజెర్సి తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, గుంటూరు జడ్‌పి మాజీ చైర్మన్‌ పాతూరి నాగభూషణం, లాలం భాస్కరరావు టిఫాస్‌ నాయకులు, దాము గెదెల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తానా ట్రెజరర్‌ రవిపొట్లూరి, తానా ఫౌండేషన్‌ ట్రస్టీ రవి మందలపు, తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ విద్యా గారపాటి, న్యూజెర్సితెలుగు అసోసియేషన్‌ ప్రతినిధి మంజు భార్గవ, టిఫాస్‌ ప్రెసిడెంట్‌ గురు ఆలంపల్లి, ఆల్బనీ ఆంధ్ర అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెంకట్‌ నిడమనూరు, సౌత్‌ జెర్సి తెలుగు అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రమ ముద్దన, టిఎల్‌సిఎ ప్రతినిధి రావు ఓలేటి ఈ కార్యక్రమానికి సహకరించారు. రాధాకృష్ణ నల్లమల, రావు ఓలేటి, శ్రీరాం ఆలోకం, సాయి జరుగుల, కృష్ణ అమిర్నేని, హరి గంగవరపు కో ఆర్డినేటర్లుగా వ్యవహరించారు. దేశీ బజార్‌కు చెందిన భాస్కర్‌ భూపతి ఆతిధ్య ఏర్పాట్లను చేశారు.

Click here for PhotoGallery