అమెరికాను వణికిస్తున్న ఫిలిప్పే తుఫాన్‌
Ramakrishna

అమెరికాను వణికిస్తున్న ఫిలిప్పే తుఫాన్‌

31-10-2017

అమెరికాను వణికిస్తున్న ఫిలిప్పే తుఫాన్‌

అమెరికాలోని దక్షిణ న్యూ ఇంగ్లాండు రీజియన్‌ను ఫిలిప్పే తుఫాను వణికిస్తోంది. ఆదివారమంతా భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి చెట్లు నేలకొరిగాయి. వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. చెట్లు విరిగిపడడంతో విద్యుత్‌ లైన్లు దెబ్బతిన్నాయి. కరెంట్‌ లేక ఇళ్లన్నీ చీకట్టు అలుముకున్నాయి. సోమవారం ఉదయమూ వర్షం జోరు తగ్గలేదు. రీజియన్‌ మొత్తం వరద హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని కనెక్టీకట్‌ రాష్ట్రంలో 1,30,000పైగా జనాలు చిమ్మ చీకట్లో ఉండిపోయాయి. అత్యవసరమైతే గానీ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యుమో ప్రజలను హెచ్చరించారు. గంటలకు 70 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని అక్కడి వాతావరణ శాఖ ప్రజలకు సూచించింది.