డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

31-10-2017

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరో షాక్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణలో కొత్త మలుపు. దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రచార కమిటీ మాజీ మేనేజర్‌ పాల్‌ మనఫోర్ట్‌, అతని వ్యాపార సహాయకుడు రిక్‌ గేట్స్‌ దేశానికి వ్యతిరేకంగా కుట్ర, మనీలాండరింగ్‌, ఇతర ఆరోపణలపై లొంగిపోవడం సంచలనం సృష్టించింది. రష్యా జోక్యంపై ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌ రాబర్ట్‌ ముల్లర్‌ ఆధ్వర్యంలో సాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరగడంతో మున్నుందు ఎలాంటి సంచలనాలు వెలుగులోకి వస్తాయోన్న ఆసక్తి నెలకొంది. విదేశీ కంపెనీలు, బ్యాంకు ఖాతాల ద్వారా మనఫోర్ట్‌, రిక్‌ గేట్స్‌లు వందల కోట్లు తరలించారని ఫెడరల్‌ అధికారులు వాషింగ్టన్‌ ఫెడరల్‌ కోర్టుకు తెలిపారు. ఈ పరిణామం అమెరికాను, ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ను కొత్త రాజకీయ సంక్షోభవంలోకి నెడుతుందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

తాజా పరిణామాలపై వైట్‌హౌస్‌లో న్యాయవాదులతో ట్రంప్‌ సమీక్షించినట్లు సమాచారం. ట్విటర్‌లో ఆయన ప్రతిపక్ష డెమోక్రాట్లను తిట్టిపోశారు. రిపబ్లికన్లు నిలిచి సంస్కరణలు అమలు చేస్తుంటే, అభివృద్ధిని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, ట్రంప్‌ బృందం, రష్యా అధికారుల మధ్య సహకారంపై అనేక అరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తునకు రాబర్ట్‌ ముల్లర్‌ను మేలో న్యాయశాఖ స్పెషల్‌ కౌన్సెల్‌గా నియమించింది. రష్యా పాత్రపైన కాకుండా ఇతర అంశాలపైనా పరిశీలన చేసే అధికారిన్ని ముల్లర్‌కు కల్పించారు.