తెలుగు భాష నేర్పడంలో 'పాఠశాల' కృషిని ప్రశంసించిన మంత్రి గంటా శ్రీనివాసరావు
Sailaja Reddy Alluddu

తెలుగు భాష నేర్పడంలో 'పాఠశాల' కృషిని ప్రశంసించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

31-10-2017

తెలుగు భాష నేర్పడంలో 'పాఠశాల' కృషిని ప్రశంసించిన మంత్రి గంటా శ్రీనివాసరావు

అమెరికాలో చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడంలో పాఠశాల చేస్తున్న కృషిని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశంసించారు. న్యూజెర్సిలో జరిగిన ఎపి జన్మభూమి కార్యక్రమంలో పాఠశాల చేస్తున్న భాషా సేవను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా ఈస్ట్‌ కోస్ట్‌ సెంటర్‌ పాఠశాల ప్రతినిధులు మంత్రి గంటాతో సమావేశమయ్యారు. రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా పాఠశాల గురించి తెలుసుకుని అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల పోస్టర్లను మంత్రి గంటా, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, న్యూజెర్సి ఏరియా తెలుగు ప్రముఖుడు ఉపేంద్ర చివుకుల ఆవిష్కరించారు. న్యూజెర్సి ఏరియా డైరెక్టర్‌ రామ్‌మోహన్‌ వేదాంతం, ఫిలడెల్ఫియా పాఠశాల డైరెక్టర్‌ నాగరాజు నలజుల, వర్జీనియా పాఠశాల డైరెక్టర్‌ శ్రావ్య బయ్యన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ జే తాళ్ళూరి, ట్రెజరర్‌ రవి పొట్లూరి, గుంటూరు మాజీ జడ్‌పి చైర్మన్‌ పాతూరి నాగభూషణం తదితరులు కూడా పాఠశాల సేవలను ప్రశంసించారు.

Click here for Event Gallery