హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి రూ.162 కోట్ల విరాళం

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి రూ.162 కోట్ల విరాళం

18-10-2017

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి రూ.162 కోట్ల విరాళం

ప్రముఖ భారత వ్యాపారవేత్త, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిత్తల్‌ రూ.162 కోట్ల పైచిలుకు మొత్తాన్ని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి విరాళంగా అందజేశారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం లోని దక్షిణాసియా సంస్థ కోసం ఈ మొత్తంతో ఒక ఎండోమెంట్‌ నిధి ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భారత్‌, అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, మయన్మార్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక వంటి దక్షిణాసియా దేశాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. సైన్స్‌, సోషల్‌సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ తదితర విభాగాల్లో మరింత మెరుగైన పరిశోధలకు బాటవేస్తుంది. హార్వర్డ్‌లో 2003లో ఏర్పాటు చేసిన ఈ దక్షిణాసియా సంస్థను ఇక నుంచీ లక్ష్మీ మిత్తల్‌ సౌత్‌ ఏషియా ఇన్స్‌టిట్యూట్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ సంస్థ ఫ్యాకల్టీ సంచాలకులుగా ఉన్న భారత సంతతి అమెరికన్‌ తరుణ్‌ ఖన్నా ఈ విషయాన్ని వెల్లడించారు.