అట్లాంటాలో ఘనంగా టాటా దసరా వేడుకలు

అట్లాంటాలో ఘనంగా టాటా దసరా వేడుకలు

16-10-2017

అట్లాంటాలో ఘనంగా టాటా దసరా వేడుకలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం (టాటా) ఆధ్వర్యంలో అట్లాంటాలో భారీ ఎత్తున దసరా వేడుకలను నిర్వహించారు. ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఈ సంబురాలను అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి ఐదు వేల మందికిపైగా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు మాట్లాడే వారంతా ఒక్కటే అని సందేశమిచ్చారు. టాటా బోర్డు చైర్మన్‌, వ్యాపార వేత్త డాక్టర్‌ మల్లారెడ్డి, అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, ఉపాధ్యక్షుడు భరత్‌, ఇతర డైరెక్టర్లు ఇందులో పాల్గొన్నారు. సాంస్కృతిక ఉత్సవాల అనంతరం రావణ దహనం చేశారు.