డొనాల్డ్‌ ట్రంప్‌ను దింపితే 65 కోట్లు!
Sailaja Reddy Alluddu

డొనాల్డ్‌ ట్రంప్‌ను దింపితే 65 కోట్లు!

16-10-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ను దింపితే 65 కోట్లు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను పదవి నుంచి దించే సమాచారాన్ని అందిస్తే దాదాపు రూ.65కోట్లు (10 మిలియన్‌ డాలర్లు) బహుమతిగా ఇవ్వనున్నట్టు హస్ట్‌లర్‌ మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు లారీ ప్లిం వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికలో సంచలన  ప్రకటన ఇచ్చాడు. నేను ట్రంప్‌ దగ్గరున్న కోట్లాది రూపాయలను ఆశించడం లేదు. అతన్ని పదవి నుంచి తప్పించాలనుకుంటున్నాను అని ప్రకటనలో పేర్కొన్నాడు. అంతేకాదు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడరు. అధికారం చేపట్టిన 9 నెలల్లో అత్యున్నత పదవికి అర్హుడు కాదని నిరూపించుకున్నారుడు అంటూ ప్రకటనలో వివరించారు. గతంలో ఇద్దరు రిపబ్లికన్‌ నేతల బండారాన్ని ఫ్లింట్‌ బయట పెట్టడం విశేషం.