యుఎఇ-ఇండియా బిజినెస్‌లో ఐటీదే కీలకపాత్ర - ప్రసాద్‌ గారపాటి
MarinaSkies
Kizen

యుఎఇ-ఇండియా బిజినెస్‌లో ఐటీదే కీలకపాత్ర - ప్రసాద్‌ గారపాటి

12-10-2017

యుఎఇ-ఇండియా బిజినెస్‌లో ఐటీదే కీలకపాత్ర - ప్రసాద్‌ గారపాటి

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, భారత్‌ మధ్య జరిగే బిజినెస్‌ వ్యవహారాల్లో ఐటీ కంపెనీలదే కీలకపాత్ర అని ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఇఎస్‌సి) చైర్మన్‌ ప్రసాద్‌ గారపాటి అన్నారు. దుబాయ్‌లో 37వ గీటెక్స్‌ టెక్నాలజీ ప్రదర్శనలో ఇండియన్‌ ఐటీ ఫెవిలియన్‌ ప్రారంభం తరువాత ప్రసాద్‌ గారపాటి మాట్లాడారు. ప్రపంచానికి మన ఐటీ శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉందని, అందువల్ల్లే ఈ రంగంలో ఇతరులతో మనం గట్టి పోటీని ఇస్తున్నామని చెప్పారు. దాదాపు 50 ఐటీ కంపెనీలు ఇందులో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయని ఇఎస్‌సి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డి కె సరీన్‌ చెప్పారు. యుఎఇలో ఉన్న ఇండియా రాయబారి నవదీప్‌ సింగ్‌ సూరి ఇండియన్‌ ఫెవిలియన్‌ను సందర్శించారు.

Click here for PhotoGallery