భారత సంతతి శాస్త్రవేత్తకు రూ.52 కోట్ల గ్రాంటు
MarinaSkies
Kizen

భారత సంతతి శాస్త్రవేత్తకు రూ.52 కోట్ల గ్రాంటు

06-10-2017

భారత సంతతి శాస్త్రవేత్తకు రూ.52 కోట్ల గ్రాంటు

అమెరికాలో క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న భారత సంతతి ప్రొఫెసర్‌ నిశా డిసిల్వాకు ఆర్థిక సాయంగా రూ.52 కోట్ల నిధులు (గ్రాంటు) దక్కాయి. ప్రాణాంతక తల, మెడ క్యాన్సర్‌లపై అధ్యయనం చేస్తున్న ఆమె, ప్రఖ్యాత సస్టెయినింగ్‌ అవుట్‌స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ రీసెర్స్‌ (ఎస్‌ఓఏఆర్‌) పురస్కారం గెలుచుకున్నారు. ఇందులో భాగంగా వ్యాధి వ్యాప్తి, తిరగబెట్టడాలను నియంత్రించే కణమార్గాలపై డిసిల్వా పరిశోధనలను కొనసాగించేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ అండ్‌ క్రానియోఫేషియల్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐడీసీఆర్‌) రూ.52 కోట్లు ఆర్థికసాయం ప్రకటించింది. దశలవారీగా వచ్చే ఎనిమిదేళ్లపాటు ఈ నిధులను ఇస్తారు. ప్రస్తుతం మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న డిసిల్వా తల, మెడ క్యాన్సర్‌లకు సంబంధించి మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ, చికిత్స విధానాలను మెరుగుపరచడంలో అమె పరిశోధనలు కీలకమయ్యే అవకాశముంది. డిసిల్వాతోపాటు అమెరికాలో మరో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది ఎస్‌ఓఏఆర్‌ గ్రాంట్లు దక్కాయి.